అమరవీరుల స్తూపానికి పాలతో శుద్ధి

అమరవీరుల స్తూపానికి పాలతో శుద్ధి
  •     బీఆర్ఎస్ నేతలు తాకి కలుషితం చేయడంతో పాలతో శుద్ధిచేశామన్న కాంగ్రెస్ నేతలు

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎదురుగా గన్ పార్కులో ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని కాంగ్రెస్ నేతలు పాలతో శుద్ధి చేశారు. సోమవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లే ముందు అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ క్రమంలో వారి చేతి స్పర్శతో స్థూపం అపవిత్రమైందని రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాలతో శుద్ధి చేశారు. 

ఈ సందర్భంగా మెట్టు సాయి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు అసలైన తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం చేశారని, అలాంటి నేతలకు తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని తాకే అర్హత లేదన్నారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారిని ఆదుకునే పనిలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఉందని తెలిపారు.