
KTR నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలన్నారు కాంగ్రెస్ MLA రామ్మోహన్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డిపై నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేదిలేదని ఆయన హెచ్చరించారు. లిక్కర్ కేసులో కవిత తీహార్ జైలుకు వెళ్లింది.. ఫోన్ ట్యాపింగ్ కేసులో KTR చంచల్ గూడ జైలుకు పోవడం ఖాయమన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత BRS.. BJPలో విలీనం అవుతదన్నారు రామ్మోహన్ రెడ్డి.
అంతకుముందు, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిల్డర్లను బెదిరించి పార్లమెంట్ ఎన్నికల కోసం రూ. 2,500 కోట్లు ఢిల్లీకి కప్పం కట్టాడని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఇవి బయటకు రాకుండా ఫోన్ ట్యాపింగ్, గొర్ల స్కాం అని టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు -కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి.. నీకు ఎవ్వడు భయపడడు.. నువ్వు వెంట్రుక కూడా పీకలేవని ఫైరయ్యారు. పేగులు మెడలో వేసుకునేది ఏంది రా హౌలా.. నువ్వు ముఖ్యమంత్రివా?.. బోటీ కొట్టేటోడివా? అంటూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.