సేవ్ ఆర్మీ పోరాటం చేయాలి

సేవ్ ఆర్మీ పోరాటం చేయాలి

కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ ను వెంటనే విరమించుకోవాలని కాంగ్రెస్  ఎమ్మెల్యే శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. రెండేళ్లుగా ఎదురు చూస్తున్న యువతకు అగ్నిపథ్ పిడుగులాంటిదన్నారు. పోలీసు కాల్పుల్లో మరణించిన రాకేష్ కి నివాళులర్పించారు. దేశాన్ని కాపాడే ఆర్మీని  రక్షించుకోవాలని..సేవ్ ఆర్మీ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అగ్నిపథ్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దగ్గర సమాధానం లేదని...కాంట్రాక్టు సైన్యం తయారీ ని విరమించుకోవాలనే యువత ఆందోళన చేస్తుందన్నారు. గత రెండేళ్లుగా ఆర్మీ రిక్రూట్ మెంట్ లేదు..పరీక్షలు జరపలేదు... నోటిఫికేషన్ ని రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సేవ్ ఆర్మీ ..లేకపోతే మన దేశ భద్రతకే ముప్పు వాటిల్లుతుందన్నారు.