తేజస్వి సూర్య  టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అడ్డుకుంటాం : కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

తేజస్వి సూర్య  టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అడ్డుకుంటాం : కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఏర్పాటును అవమానించేలా పాకిస్తాన్‌‌‌‌తో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య హైదరాబాద్ టూర్‌‌‌‌‌‌‌‌ను బరాబర్ అడ్డుకుంటామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ స్పష్టం చేశారు. శనివారం గాంధీ భవన్‌‌‌‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్‌‌‌‌లో ఆనాడు తేజస్వి సూర్య మాటలను ఖండించలేని తెలంగాణ బీజేపీ నేతలు, ఇప్పుడు నమో జెన్‌‌‌‌ జీ కాంక్లేవ్ పేరుతో సిటీకి ఆహ్వానించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.

తేజస్వి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పిన తర్వాతనే హైదరాబాద్‌‌‌‌లో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. తమ అస్థిత్వాన్ని, సెంటిమెంట్‌‌‌‌ను ఎగతాళి చేసి మాట్లాడిన తేజస్వి తెలంగాణకు వస్తే..ఆవేశంతో రగిలిపోతున్న ఇక్కడి యువకుల ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.