బీజేపీ, టీఆర్ఎస్ పంచుతున్న డబ్బంతా ప్రజలదే : ఉత్తమ్

బీజేపీ, టీఆర్ఎస్ పంచుతున్న డబ్బంతా ప్రజలదే : ఉత్తమ్

మునుగోడులో ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యేలా బీజేపీ, టీఆర్ఎస్ ప్రవర్తిస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. మద్యం, డబ్బులతో గెలవాలని బీజేపీ, టీఆర్ఎస్ యత్నిస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ,  టీఆర్ఎస్ పంచుతున్న డబ్బంతా ప్రజల నుంచి దోచుకున్నదేనని అన్నారు. మునుగోడు ప్రజలు చాలా చైతన్యం గలవారని.. బీజేపీ టీఆర్ఎస్ ప్రలోభాలకు లొంగకుండా కాంగ్రెస్ను గెలపిస్తారని చెప్పారు. 

ఎన్నికల ప్రక్రియలో ఎన్ని అవకతవకలు జరిగినా ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదని ఉత్తమ్ మండిపడ్డారు. రాజకీయాలు ఇంత దిగజారడానికి కేసీఆరే కారణమని విమర్శించారు. 23న తెలంగాణలోకి రాహుల్ యాత్ర ఎంటరవుతుందని తెలిపారు. రాష్ట్రంలో రాహుల్ను కలిసే వారిలో వివిధ రంగాల మేధావులు ఉంటారన్నారు. దేశ హితం కోసం రాహుల్ చేపట్టిన యాత్రలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని కోరారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని.. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ సమస్య రెట్టింపు అయ్యిందని మండిపడ్డారు.