కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్.. రూ.210 కోట్లకు లెక్క చెప్పాలన్న ఐటీ

కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్.. రూ.210 కోట్లకు లెక్క చెప్పాలన్న ఐటీ

లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో.. కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్. కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేశాయి ఫ్రీజ్ చేశారు ఇన్ కం ట్యాక్స్ అధికారులు. ఈ రెండు విభాగాల నుంచి 210 కోట్ల రూపాయలకు సంబంధించిన రికవరీ చేయాల్సి ఉందని ఐటీ శాఖ వెల్లడించింది. బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేయటంపై ఆ పార్టీ జాతీయ నేత అయజ్ మాకెన్ మీడియాకు వెల్లడించారు. మోదీ ప్రభుత్వం కుట్ర పూరితంగా.. ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీల బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారాయన.

 దీని పై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే స్పందిస్తూ లోక్‌సభ ఎన్నికలకు ముందు దేశంలోని అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ - ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఖాతాలను మోదీ ప్రభుత్వం స్తంభింపజేసిందని ఆరోపించారు. ఇది భారత ప్రజాస్వామ్యంపై పెద్ద దాడి అని తెలిపారు. బీజేపీ వసూలు చేసిన రాజ్యాంగ విరుద్ధమైన డబ్బును వారు ఎన్నికల కోసం వినియోగిస్తారు, కానీ తాము క్రౌడ్‌ఫండింగ్ ద్వారా సేకరించిన డబ్బును ప్రజల క్షేమం కోసం వాడతామన్నారు. 

మోదీ కొనసాగితే భవిష్యత్తులో ఎన్నికలు ఉండవని ఈ దేశంలో బహుళ-పార్టీ వ్యవస్థను కాపాడాలని కోరారు. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని మేము న్యాయవ్యవస్థకు విజ్ఞప్తి చేశారు. ఈ నిరంకుశ పాలనపై వీధుల్లోకి వచ్చి గట్టిగా పోరాడతామని  ఖర్గే అన్నారు.