కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ కమిటీ .. చైర్మన్​గా పొన్నం

కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ కమిటీ .. చైర్మన్​గా పొన్నం

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​పార్టీ బీసీ డిక్లరేషన్​కమిటీ, అడ్వైజరీ కమిటీలను ఏర్పాటు చేసింది. డిక్లరేషన్​ కమిటీకి చైర్మన్​గా పొన్నం ప్రభాకర్​ను నియమిస్తూ రేవంత్​ రెడ్డి బుధవారం ఆదేశాలు జారీ చేశారు. కో చైర్మన్లుగా నూతి శ్రీకాంత్, ఎర్ర శేఖర్, ఈరవర్తి అనిల్​నేత, జెరిపాతి జైపాల్, గాలి అనిల్​ కుమార్, తోటకూర వజ్రేశ్​యాదవ్​లను నియమించారు. అడ్వైజరీ కమిటీ చీఫ్​పాట్రన్లుగా వీహెచ్, పొన్నాల లక్ష్మయ్యను నియమించారు. మధుయాష్కీ, మహేశ్​కుమార్​ గౌడ్​, అంజన్​కుమార్ యాదవ్, కొండా సురేఖ, సురేశ్​ షెట్కార్, కత్తి వెంకటస్వామి, సంగిశెట్టి జగదీశ్వర్​రావు అడ్వైజర్లుగా ఉండనున్నారు. వారితో పాటు మెట్టు సాయి, కేతూరి వెంకటేశ్​ సహా 37 మందిని అడ్వైజరీ కమిటీలో సభ్యులుగా చేర్చారు.త్వరలో షాద్​నగర్​లో నిర్వహించనున్న బీసీ డిక్లరేషన్​ సభ కో ఆర్డినేటర్​గా వీర్లపల్లి శంకర్​కు బాధ్యతలు అప్పగించారు.