జవహర్​నగర్ డంపింగ్ యార్డును తరలించాలె

జవహర్​నగర్ డంపింగ్ యార్డును తరలించాలె
  • దమ్మాయిగూడ మున్సిపల్ ఆఫీసు ఎదుట కాంగ్రెస్ నాయకుల ఆందోళన

జవహర్​నగర్, వెలుగు :  భారీ వర్షాలతో జవహర్​ నగర్ డంపింగ్​ యార్డ్​నుంచి వచ్చే కంపును భరించలేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని దమ్మాయిగూడ మున్సిపల్ ఆఫీసు ఎదుట మంగళవారం మేడ్చల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేశారు. కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. డంపింగ్​యార్డుతో జనాలు ఇబ్బంది పడుతున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవట్లేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి డంపింగ్ యార్డును మరో చోటకి తరలించాలని డిమాండ్​ చేశారు. లేకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు.

ధర్నా చేస్తున్న  నాయకులను పోలీసులు అరెస్ట్​ చేశారు. మరోవైపు నాగారం మున్సిపల్​పరిధిలోని పలు కాలనీల్లో వరద నీరు ఇండ్లలోకి చేరి డ్రైనేజీ పొంగుతోందంటూ  కీసర, రాంపల్లి చౌరస్తాలో టీఆర్ఎస్​నాయకులు కాలనీవాసులతో కలిసి ఆందోళన చేశారు. వారిని పోలీసులు స్టేషన్​కు తరలించారు.