సిటీలో కాంగ్రెస్ నేతల నిరసన

సిటీలో కాంగ్రెస్ నేతల నిరసన

హైదరాబాద్: సిటీలో కాంగ్రెస్ నేతలు ఆందోళనలకు దిగారు. తమ పార్టీ నేత రాహుల్ గాంధీని ఈడీ విచారించడానికి పిలవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి కాంగ్రెస్ ర్యాలీ మొదలైంది. తెలుగుతల్లి ఫ్లై ఓవర్ కింది నుంచి హాకా భవన్, కళాంజలి మీదుగా ఈడీ ఆఫీస్ వరకు ర్యాలీ కొనసాగనుంది. ఈ ర్యాలీకి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, సీతక్క, కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, మహేశ్వర్ రెడ్డి తదితరులు వచ్చారు. 
మధ్యాహ్నం 3గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు
కాంగ్రెస్ పార్టీ ఆందోళన నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ర్యాలీ వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గాంధీ భవన్, బషీర్ బాగ్, హైదర్ గూడ, తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ చౌరస్తా, ఎన్టీఆర్‌ మార్గ్‌, లిబర్టీ జంక్షన్‌, ఖైరతాబాద్‌ చౌరస్తా, ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌, లక్డీకపూల్, చింతల్‌ బస్తీ,  సెక్రటేరియట్ వెళ్లే మార్గాల్లో ఆంక్షలు విధించారు. వాహనదారులు ఆంక్షలను గుర్తించి ప్రత్యామ్నాయ మార్గాల్లో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.