బీ ఫారం బాధ్యతలు DCCలకు ఇచ్చిన PCC

బీ ఫారం బాధ్యతలు DCCలకు ఇచ్చిన PCC
  • 32 మంది డీసీసీ లకు ఏ ఫారం ఇచ్చిన పీసీసీ
  • బి.ఫారం బాధ్యతలు డీసీసీ లకు ఇచ్చిన పీసీసీ
  • ఆఫడవిట్ విడుదల చేసిన కాంగ్రెస్

హైదరాబాద్ లోని గాంధీభవన్ లో కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క, మాజీ ఎల్పీ నాయకుడు జానా రెడ్డి, షబ్బీర్ అలీ,  కార్య నిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, కుసుమ కుమార్, మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజా నర్సింహ, కుమార్ రావ్, ఇతరులు పాల్గొన్నారు.

స్థానిక ఎన్నికలకు సంబంధించి జిల్లా పార్టీ అధ్యక్షులకు పీసీసీ పూర్తి అధికారాలు కట్టబెట్టింది. 32 మంది డీసీసీ అధ్యక్షులకు పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఏ-ఫారమ్ లు అందజేశారు. జిల్లాల్లోని ఎంపీటీసీ, జడ్పీటీసీలకు బి-ఫారం అందజేసే అధికారం వారికే ఇచ్చారు. అభ్యర్థుల ఎంపిక కోసం ఇప్పటికే కోఆర్డినేటర్లను నియమించిన పీసీసీ.. ఇక మండల స్థాయిలో నిర్వహించిన సమావేశాల ఆధారంగా అభ్యర్ధులకు బి-ఫారమ్  అందజేయనున్నారు. ఈ బాధ్యతలను డీసీసీలకు అప్పగిస్తూ పీసీసీ నిర్ణయం తీసుకుంది.

బి-ఫారమ్ పొందిన అభ్యర్థి 20 రూపాయల ప్రమాణ పత్రం ఇచ్చేలా.. ఒక ఆఫడవిట్ కూడా రూపొందించి డీసీసీలకు అందజేసింది పీసీసీ. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక, బి-ఫారమ్ తదితర ఎన్నికల వ్యవహారాలను స్థానిక నాయకత్వమే చూసుకోవాలని స్పష్టం చేసింది.