నిరసనలు.. అరెస్టుల మధ్యే కాంగ్రెస్​ 'దశాబ్ది దగా'

నిరసనలు.. అరెస్టుల మధ్యే కాంగ్రెస్​ 'దశాబ్ది దగా'

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి పిలుపుమేరకు సీఎం కేసీఆర్​ 9 ఏళ్ల పాలనపై దశాబ్ది దగా పేరుతో కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్​లోని ఆ పార్టీ కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్​తోకూడిన 10 తలల దిష్టి బొమ్మను నేతలు దహనం చేశారు. బీఆర్​ఎస్​ సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు తోపులాటలు జరిగాయి. ఇరువర్గాలు వాగ్వాదానికి దిగారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

ముందస్తు అరెస్టులు..

నిరసనల విషయం తెలుసుకున్న పోలీసులు కాంగ్రెస్​ సీనియర్​నేతలను హౌస్​ అరెస్ట్​ చేశారు. వారిలో షబ్బీర్​అలీ, తదితరులు ఉన్నారు. నేతల హౌస్​ అరెస్టులను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి, కోమటి రెడ్డి వెంకటి రెడ్డి ఖండిచారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలపడం ఒక భాగమని వారు అన్నారు.  కేసీఆర్​ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని విమర్శించారు.