- 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 35.03% ఓట్లు
- ఈ ఉప ఎన్నికలో ఏకంగా 50.83% ఓట్లు
- భారీగా పడిపోయిన బీఆర్ఎస్ గ్రాఫ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటు షేర్‌ను అంతకంతకు పెంచుకుంటున్నది. వరుస విజయాలే కాకుండా.. భారీ స్థాయిలో ఓటర్లను సంపాదించుకుంటున్నది. ఇక అదే సమయంలో బీఆర్ఎస్పార్టీ తన ఓట్ షేర్‌ను క్రమంగా కోల్పోతున్నది. 2018 అసెంబ్లీ ఎన్నికల నుంచి 2024 పార్లమెంట్ ఎలక్షన్లు.. ఆ తర్వాత కంటోన్మెంట్బైపోల్, ఇప్పుడు జూబ్లీహిల్స్ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్ఓట్షేర్ క్రమంగా పెరుగుతూ వచ్చింది. కాంగ్రెస్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 28.43 శాతం, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 29.48 శాతం, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 39.69 శాతం, 2024 పార్లమెంట్ఎన్నికల్లో 40.10 శాతం ఓట్లు సాధించింది. ఇక కంటోన్మెంట్బైపోల్లో తన ఓటు షేర్‌ను గణనీయంగా పెంచుకుంది. ఇక్కడ కాంగ్రెస్‌కు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 16.72 శాతం ఓట్లు వస్తే, ఉప ఎన్నికలో 40.86 శాతం ఓట్లు వచ్చాయి.
జూబ్లీహిల్స్ విషయానికొస్తే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 35.03 శాతం ఓట్లు రాగా, ఇప్పుడు ఓటు షేర్ ఏకంగా 15 శాతం పెరిగి.. మొత్తం 50.83 శాతం ఓట్లను కాంగ్రెస్ సాధించింది. మొత్తంగా ఈ ఏడేండ్లలో కాంగ్రెస్ఓట్ షేర్ ఏకంగా 22.40 శాతం పెరిగింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 12 సీట్లు సాధించిన కాంగ్రెస్.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మూడు సీట్లకే పరిమితమైన ఆ పార్టీ.. 2024 ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకొని సత్తా చాటింది. ఇక వరుసగా జరిగిన రెండు అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ భారీ మెజార్టీ సాధించి గెలుపొందింది.
పడిపోతున్న బీఆర్ఎస్ ఓటు బ్యాంక్..
పదేండ్లపాటు రాష్ట్రంలో చక్రం తిప్పి, వివిధ ఎన్నికల్లో సత్తాచాటుతూ వచ్చిన బీఆర్ఎస్.. క్రమంగా తన ఓటుబ్యాంకును కోల్పోతున్నది. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2023లో ఆ పార్టీ ఓట్ షేర్ సుమారు 9శాతం తగ్గింది. 2019 పార్లమెంట్ఎన్నికలతో పోలిస్తే 2024లో ఏకంగా 25శాతం ఓట్లను కోల్పోయింది. బీఆర్ఎస్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 46.87శాతం, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 41.29 శాతం, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 37.62 శాతం, 2024 పార్లమెంట్ఎన్నికల్లో16.68 శాతం ఓట్లు సాధించింది. ఇక జూబ్లీహిల్స్‌లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 43.94 శాతం ఓట్లు సాధించగా, ఇప్పుడు బైపోల్‌లో ఆ పార్టీ ఓటు షేర్ 38.13 శాతానికి
పడిపోయింది.
జూబ్లీహిల్స్‌లో జోరు...
2023 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తాజా ఉప ఎన్నికలో జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ఓట్షేర్ 15శాతానికి పైగా పెరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో మొత్తం 1,83, 312 ఓట్లు పోల్‌కాగా.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ 80,549 ఓట్లు అంటే 43.94% ఓట్‌షేర్‌తో విజయం సాధించారు. అప్పుడు కాంగ్రెస్అభ్యర్థిగా పోటీ చేసిన అజారుద్దీన్64,212 ఓట్లతో 35.03% ఓట్షేర్కే పరిమితమయ్యారు. వీరి మధ్య కేవలం 8.91 శాతం ఓట్ల తేడా ఉంది. కానీ ప్రస్తుత ఉప ఎన్నికలో సీన్‌రివర్స్ అయింది. ఈసారి పోలైన 1,94,727 ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ 98,988 ఓట్లతో ఏకంగా 50.83% ఓట్షేర్సాధించారు. అంటే కాంగ్రెస్‌కు గత ఎన్నికల కంటే 15.80% ఎక్కువ ఓట్లు వచ్చాయి. అదే సమయంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత 74,259 ఓట్లతో 38.13% ఓట్షేర్కే పరిమితమయ్యారు. అంటే బీఆర్‌ఎస్‌కు 5.81% ఓట్లు తగ్గాయి. అలాగే ఈ బైపోల్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్మధ్య ఓట్ల తేడా 12.4 శాతం ఉంది.
జూబ్లీహిల్స్ సెగ్మెంట్‌లోఓట్ షేర్ మారిందిలా..
పార్టీ 2023 2025 (బైపోల్)
కాంగ్రెస్ 35.03 50.83
బీఆర్ఎస్ 43.94 38.13
బీజేపీ 14.11 8.76
