కాంగ్రెస్ ఆమోదించిన 9 తీర్మానాలివే..

V6 Velugu Posted on Nov 28, 2021

ఇందిరా పార్క్  కాంగ్రెస్ వరి దీక్షలో 9 తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. కిసాన్ కాంగ్రెస్ నేతలు కోదండరెడ్డి, అన్వేష్ రెడ్డి తీర్మానాలను సభలో ప్రవేశ పెట్టారు.ఖరీఫ్ వరి ధాన్యాన్ని వెంటనే కొనుగొలు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనాలన్నారు. ధాన్యం  కొనుగోలు వ్యవస్థలో రైస్ మిల్లర్ల ప్రమేయం ఉండకూడదన్నారు. 

కాంగ్రెస్ ఆమోదించిన తీర్మానాలు

1 ప్రస్తుత ఖరీఫ్   వరి ధాన్యాన్ని తక్షణమే కొనుగొలు చేయాలి.కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి

2. తడిసిన ధాన్యాన్ని  కూడా ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలి.

3.  ధాన్యం  కొనుగోలు వ్యవస్థలో రైస్ మిల్లర్ల ప్రమేయం ఉండకూడదు.

4. పోయిన రబీ పంట సేకరణ లో జరిగిన అవకతవకల వల్ల రైతుకు భారీగా జరిగిన ఆర్థిక నష్టాల మీద సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపంచాలి.

5. యాసంగి పంటల సాగు విషయంలో  ఆంక్షలు పెట్టకూడదు. భూమి స్వభావం, వనరుల అనుకూలతను బట్టి రైతుకు సాగు పై స్వేచ్ఛ ఉండాలి.

6. మద్దతు ధరల పరిధిలో ఉన్న ప్రధానమైన పంటలను మద్దతు ధరకు తక్కువ కాకుండా కొనుగోలు చేయాలి.

7. వ్యవసాయ పంటలకు సమగ్ర మద్దతు ధర, కొనుగోలు విషయంలో చట్ట బద్ధత కల్పించాలి.

8. సమగ్రమైన విత్తన చట్టాన్ని తెచ్చి కల్తీ విత్తనాల బారి నుండి రైతును కాపాడాలి.

9.  ఏకకాలంలో లక్ష రూపాయల పంటల రుణమాఫీ చేయాలి.ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన పంట నష్టం 2020- 21 సంవత్సరాలకు కోర్టు ఆదేశల అనుసరం పంట నష్ట పరిహారం వెంటనే రైతులకు చెల్లించాలి.

Tagged IndiraPark, varideeksha , Congress unanimously, passe, 9 resolutions

Latest Videos

Subscribe Now

More News