వీ6 వెలుగుకు కాంగ్రెస్ అండగా ఉంటుంది : రేవంత్ రెడ్డి

వీ6 వెలుగుకు కాంగ్రెస్ అండగా ఉంటుంది : రేవంత్ రెడ్డి

ప్రతి పక్ష పాత్ర పోషిస్తున్న వీ6 వెలుగును బ్యాన్ చేయటం దుస్సాహసమని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు ప్రపంచానికి తెలియజేస్తున్నందుకు వీ6 మీద కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వీ6 ను బ్యాన్ చేస్తే ఎవరు సహించరని రేవంత్ మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం అయిందన్న ఆయన... అందుకే ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. మీడియాను నియంత్రిస్తే సమాజం సహించదని చెప్పారు. సీఎం కేసీఆర్ అవినీతిలో కురుకుపోయారని, మంత్రులు, బీఅర్ఎస్ నేతలు అరాచకాలు, అక్రమాలు చేస్తూ సమాజాన్ని పట్టిపీడిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

వీ6, వెలుగుకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్న ఆయన... సీఎం కేసీఆర్, మంత్రి కేటిఆర్ పిచ్చిపట్టినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ పాలన అవినీతిమయమని, బీఆర్ఎస్ ను కూకటి వేళ్ళతో పెకిళిస్తేనే తెలంగాణలో ప్రజాస్వామ్యం బతుకుతుందని రేవంత్ తెలిపారు.