తాండూరు మున్సి పల్ కార్యాలయంలో మున్సి పల్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక

తాండూరు మున్సి పల్ కార్యాలయంలో మున్సి పల్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక

తాండూరు, వెలుగు: వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ కార్యాలయంలో బుధవారం జరిగిన కో-ఆప్షన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాలుగు స్థానాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో సుభాష్ (15వ వార్డు), మహ్మద్ రహీం (10వ వార్డు), చినోళ్ల సరిత (13వ వార్డు), ఆఫ్రిన్ జవేరియా (17వ వార్డు) సభ్యులుగా ఎంపికయ్యారు.

పార్టీ గెలుపు కోసం నిరంతరం కష్టపడిన వారికే ఈ అవకాశం దక్కిందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొనగా, మున్సిపల్ చైర్​పర్సన్ నీరజ బాల్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, కమిషనర్ మధుసుధన్ రెడ్డి సమక్షంలో ఈ ఎన్నిక ప్రక్రియ ముగిసింది.