కాంగ్రెస్‌‌ క్యాండిడేట్లు ఏకగ్రీవం !

కాంగ్రెస్‌‌  క్యాండిడేట్లు ఏకగ్రీవం !

గోదావరిఖని, వెలుగు : రామగుండం కార్పొరేషన్‌‌ ఒకటవ డివిజన్‌‌లో కాంగ్రెస్‌‌ క్యాండిడేట్‌‌ మడిపెల్లి విజయ మల్లేశ్‌‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సమాచారం. ఈ డివిజన్‌‌లో బీఆర్‌‌‌‌ఎస్‌‌, బీజేపీ నుంచి నామినేషన్ వేసిన విజయగిరి శ్వేత, రీమా బిశ్వాస్‌‌ సోమవారం తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. జనరల్​మహిళకు కేటాయించిన ఈ డివిజన్‌‌లో ముగ్గురు మాత్రమే నామినేషన్‌‌ వేయడం.. అందులో ఇద్దరు తప్పుకోవడంతో కాంగ్రెస్​ క్యాండిడేట్‌‌ ఏకగ్రీవమైంది. ఈ విషయాన్ని మంగళవారం సాయంత్రం ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. 

మెదక్‌‌లో కాంగ్రెస్ బోణీ

మెదక్, వెలుగు : మెదక్ మున్సిపల్‌‌ ఎన్నికల్లో కాంగ్రెస్ బోణీ కొట్టింది. 32వ వార్డులో కాంగ్రెస్ క్యాండిడేట్‌‌ గోదల మానస ఏకగ్రీవం అయ్యారు. ఆ వార్డుకు మానసతో పాటు, బీఆర్‌‌ఎస్‌‌ నుంచి గోదల జ్యోతి, మరో ముగ్గురు నామినేషన్లు వేశారు. సోమవారం  నలుగురు  విత్‌‌ డ్రా చేసుకోవడంతో మానస ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఈ ఎన్నికలను మంగళవారం అధికారికంగా ప్రకటించనున్నారు.