రాజేంద్రనగర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ నాయకుల ధర్నా

రాజేంద్రనగర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ నాయకుల ధర్నా

రంగారెడ్డి జిల్లా: నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాజేంద్రనగర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు సిలిండర్లతో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇంఛార్జ్ జ్ఞానేశ్వర్ తో పాటు శంషాబాద్, రాజేంద్రనగర్, గండిపేట్ మండలాల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని విమర్శించారు. పెట్రోల్, డీజిల్,గ్యాస్ ధరలు పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. 

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు నిత్యవసర సరుకులపై ధరలు పెంచలేదన్న ఆయన... టీఆర్ఎస్, బీజేపీ అధికారంలోకి రాగానే నిత్యవసర సరుకుల ధరలు అమాంతం పెంచేశారని ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి నిత్యవసర సరుకులతో పాటు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.