పాల్వంచ గుడిపాడులో వైభవంగా వేంకటేశ్వరస్వామి ఆలయ పునఃప్రతిష్ఠ

పాల్వంచ గుడిపాడులో వైభవంగా వేంకటేశ్వరస్వామి ఆలయ పునఃప్రతిష్ఠ
  •     హాజరైన శ్రీలంక సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఆధ్యాత్మిక గురువు త్రిదండి శఠకోపముని రామానుజ జీయర్ స్వామి, ఎమ్మెల్యేలు

పాల్వంచ, వెలుగు : పాల్వంచ గుడిపాడులో మోక్ష వేంకటేశ్వరస్వామి ఆలయ పునఃప్రతిష్ట కార్యక్రమం వైభవంగా జరిగింది. మేల్కోటి త్రిదండి శఠకోపముని రామానుజ జీయర్ స్వామి చేతుల మీదుగా యంత్ర,శిఖర, విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీలంక దేశానికి చెందిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి తురాయ్ రాజాజీ హాజరయ్యారు. ఆయనకు కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ గణేశ్, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా స్వాగతం పలికారు.

శ్రీదేవి గోదాదేవి సమేత మోక్ష వేంకటేశ్వరస్వామి వారి కల్యాణాన్ని సురేశ్ రెడ్డి దంపతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పినపాక, వైరా ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు మాలోత్  రాందాస్ నాయక్, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, శ్యామల గోపాలన్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ చైర్​పర్సన్ సురేశ్ రెడ్డి, మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు, కేఎల్ఆర్ విద్యాసంస్థల కార్యదర్శి వై.మధుసూదన్ రెడ్డి తోపాటు అధికారులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.