వలసొచ్చినోళ్లకు, ఒరిజినల్ కాంగ్రెసోళ్లకు మధ్య పంచాది : మధుయాష్కీ

వలసొచ్చినోళ్లకు, ఒరిజినల్ కాంగ్రెసోళ్లకు మధ్య పంచాది : మధుయాష్కీ

కుట్రపూరితంగా పార్టీని నాశనం చేసే ప్రయత్నం జరుగుతోందని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ అన్నారు. క్యారెక్టర్ లేనివాళ్లు పార్టీని నడిపిస్తున్నారని, తమను ప్రశ్నించే స్థాయి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వలస వచ్చినోళ్లకు, కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ రోజు పంచాయితీ నడుస్తోందని అన్నారు. ఇదంతా పార్టీని నాశనం చేసే ప్రయత్నమేనని ఆరోపించారు. సీఎల్పీ నేతను విస్మరించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదన్న మధుయాష్కీ.. అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరిగిందని వాపోయారు.

సోషల్ మీడియా ఖబర్దార్ అన్న మధుయాష్కీ.. తమపై తప్పుడు ప్రచారం చేయకండని అభ్యర్థించారు. పీజేఆర్ కుమారుడు విష్ణు అవకాశం ఇవ్వరా..? అని ప్రశ్నించారు. విష్ణుకు అనుకూలంగా అలోచించి వార్తలు రాయండని కోరారు. తమకు పదవులు కాదు..పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్లకు పదవులు ఇవ్వాలని అడుగుతున్నామని కోరారు. కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.