బషీర్‌బాగ్, వెలుగు: దేశంలో ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, న్యాయవ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైనా ఉందని పౌర హక్కుల నేత, విద్యావేత్త ప్రొఫెసర్ జి.హరగోపాల్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో భారత ప్రజా న్యాయవాదుల సంఘం సహాయ కార్యదర్శి డి.సురేశ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆపరేషన్ కగార్ కారణంగా మానవ హక్కులు, రాజ్యాంగం, న్యాయవ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయని ఆరోపించారు. శాంతి చర్చలు నిర్వహించాలని కోరిన వారిపై నిర్బంధ చర్యలు చేపట్టి, వారిని ‘అర్బన్ నక్సల్స్’గా ముద్ర వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సభలో వీక్షణం సంపాదకుడు వేణుగోపాల్, న్యాయవాదులు జవారి, రమేశ్, రజిత తదితరులు పాల్గొన్నారు.
