రాజ్యాంగ విలువలు ప్రతి ఇంటికీ చేరాలి : హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌‌ అపరేశ్‌‌ కుమార్‌‌ సింగ్‌‌

రాజ్యాంగ విలువలు ప్రతి ఇంటికీ చేరాలి : హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌‌ అపరేశ్‌‌ కుమార్‌‌ సింగ్‌‌
  •     రిపబ్లిక్‌‌ డే వేడుకల్లో  హైకోర్టు సీజే జస్టిస్‌‌ అపరేశ్ కుమార్ వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: దేశంలో మారుతున్న సామాజి క, ఆర్థిక, రాజకీయ అవసరాలను తీర్చడానికి ఏర్పడిన సామూహిక ప్రకటనే రాజ్యాంగమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ అపరేశ్‌‌ కుమార్‌‌ సింగ్‌‌ అన్నారు. రాజ్యాంగ లక్ష్యాల సంరక్షణ బాధ్యత న్యాయవ్యవస్థపై ఉందని తెలిపారు. రాజ్యాంగం విలువలు కేవలం కోర్టు హాలులకే పరిమితం కాకుండా ప్రతి ఇంటికి, వ్యక్తికీ చేరాల్సిన అవసరముందని చెప్పారు. రాజ్యాంగ విలువలను ప్రజలు అర్థం చేసుకున్నప్పుడే దాని ప్రయోజనం నెరవేరుతుందని పేర్కొన్నారు. సోమవారం హైకోర్టు ఆవరణలో 77వ గణతంత్ర  దినోత్సవ వేడుకలు నిర్వహించారు. 

జాతీయ పతా కాన్ని ఎగురవేసిన అనంతరం సీజే మాట్లాడారు.గతేడాది 79,029 కేసులు దాఖలైతే 75,419 పరిష్కారమయ్యాయని, మంజూరైన న్యాయమూర్తుల్లో 70 శాతం జడ్జీలతో 95 శాతం కేసులు పరిష్కరించామని తెలిపారు. రాజేంద్రనగర్‌‌లో కొత్త హైకోర్టు నిర్మాణం చురుగ్గా సాగుతోందన్నారు. కార్యక్రమంలో అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహా రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ పాల్గొన్నారు.