- విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: త్వరలో వరంగల్ ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఢిల్లీ లో మాట్లాడారు. వరంగల్ ఎయిర్ పోర్ట్ కు కావాల్సిన భూమి సేకరణ ప్రక్రియ పూర్తి అయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆ భూమిని విమానయాన శాఖకు అప్పజెప్పిందని తెలిపారు. డీపీఆర్ వచ్చిన తర్వాత పనులు ప్రారంభించనున్నట్లు కేంద్రమంత్రి స్పష్టం చేశారు.
