ఓయూకు సీఎం రాకను స్వాగతిస్తున్నాం: కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం కో ఆర్డినేషన్ కమిటీ

ఓయూకు సీఎం రాకను స్వాగతిస్తున్నాం: కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం కో ఆర్డినేషన్ కమిటీ

ఓయూ, వెలుగు: ఈ నెల 7న సీఎం రేవంత్​రెడ్డి ఓయూకు రావడాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం కో ఆర్డినేషన్ కమిటీ ప్రతినిధులు తెలిపారు. సోమవారం ఆర్ట్స్ కాలేజీ వద్ద వారు మీడియాతో మాట్లాడారు. వర్సిటీల్లో పనిచేసే కాంట్రాక్ట్ లెక్చలర్లకు యూజీసీ వేతనాలను అమలు చేయాలని ఆరు నెలల క్రితం సీఎం అధికారులను దిశానిర్దేశం చేశారని, అయినా అమలుకాకపోవడం విచాకరమని అన్నారు. ముఖ్యమంత్రి ఆ సమస్యను పరిష్కరించేలా చొరవ చూపాలని కోరారు.