బీఆర్ఎస్ పార్టీ పేరు మారింది...ఎక్కడ అంటే..

బీఆర్ఎస్ పార్టీ పేరు మారింది...ఎక్కడ అంటే..

బీఆర్ఎస్ పార్టీని ఇప్పటికే తాగుబోతుల పార్టీ అని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. అయినా పార్టీ నేతల తీరులో మార్పు రావడం లేదు. ఇందుకు నిదర్శనం నార్సింగిలో జరిగిన ఆత్మీయ సమ్మేళనం అని చెప్పొచ్చు. ఏప్రిల్ 10వ తేదీ సోమవారం నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించింది. అయితే ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన బ్యానర్ చర్చాంశనీయంగా మారింది.

ఆ బ్యానర్ లో బీఆర్ఎస్ కు బదులు బీ.ర్.స్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నార్సింగి మున్సిపాలిటీ అంటూ.. తెలుగులో తప్పుల తడకగా  ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేతో పాటు మున్నిపాల్ చైర్మన్, వైస్ చైర్మన్, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు,బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హాజరయ్యారు. వీరంతా ఈ బ్యానర్ ను చూసి నవ్వుకున్నారు. అయితే  బ్యానర్ మాత్రం తొలగించలేదు. ప్రస్తుతం ఈ టాపిక్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.