వంట పొగ సిగరెట్ స్మోకింగ్ కంటే డేంజర్: భారత మహిళలకి డేంజర్ బెల్స్..

వంట పొగ సిగరెట్ స్మోకింగ్ కంటే డేంజర్: భారత మహిళలకి డేంజర్ బెల్స్..

లక్షల మంది మన దేశ మహిళలకు  కట్టెల పొయ్యి, పిడకల మీద లేదా చెక్క వ్యర్థాలతో మంట పెట్టి దాని మీద వంట చేయడంతో రోజు  అనేది స్టార్ట్ అవుతుంది. కానీ ఈ సాధారణ అలవాటు చాలా ప్రమాదకరమైనదని ఒక కొత్త పరిశోధన చెబుతోంది. వంట పొగ వారి ఊపిరితిత్తులను సంవత్సరాలుగా సిగరెట్లు తాగినంత తీవ్రంగా దెబ్బతీస్తోంది.

 ఈ అధ్యయనంలో పొగాకు తాగే వారిని, అలాగే వంట పొగకు ఎక్కువ కాలం గురైన మహిళలను పోల్చారు. బ్రోన్కియాక్టాసిస్ (bronchiectasis) ఈ రకమైన అనారోగ్యం పొగకు గురైన COPD (దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి) రోగులలో 53% మందికి ఉంది. అయితే సిగరెట్ తాగేవారిలో మాత్రం కేవలం 18% మందికే ఉంది.

ఈ పొగ వల్ల ఊపిరితిత్తుల నిర్మాణం దెబ్బతినడంతో మహిళలు సిగరెట్ తాగకపోయినా ఎక్కువగా జ్వరాలు, ఆసుపత్రి పాలవడం, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు.

ఫరీదాబాద్‌లోని అమృత హాస్పిటల్ డాక్టర్లు సిగరెట్ తాగని మహిళల్లో బయోమాస్ ఇంధనం (కట్టెలు, పిడకలు) కారణంగా వచ్చే COPD వ్యాధి పై దృష్టి పెట్టాలని కోరారు. డాక్టర్ సంజీవ్ సింగ్ ప్రకారం ఈ వంట పొగ నష్టం రోజు సిగరెట్ తాగే దాని కంటే కూడా కొన్నిసార్లు మరింత ప్రమాదకరంగా ఉంటుంది. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో ఇంట్లో పొగ వల్ల గాలి నాణ్యత గురించి ఆలోచించాలి. 

 వంట పొగకు గురైన వారిలో 84-85% మంది మహిళలే ఉన్నారు. వారిలో కేవలం 17% మంది మాత్రమే వంట పొగ ఊపిరితిత్తులకు శాశ్వతంగా హాని చేస్తుందని అర్థం చేసుకున్నారు. వంట పొగ హానికరమని తెలియకపోవడం వల్ల చాలా మంది మహిళలు ఊపిరి ఆడక, వ్యాధి ముదిరిన తర్వాతే ఆసుపత్రికి వెళ్తున్నారు.

 సిగరెట్ తాగేవారి కంటే వీరి ఊపిరితిత్తుల పనితీరు కొంచెం బాగానే ఉన్న వీరికి  ఎక్కువగా శ్వాస ఆడకపోవడం, తరచుగా ఇన్‌ఫెక్షన్లు,  ICUలో చేరే అవకాశం ఎక్కువగా ఉంది. చాలామందికి సాధారణ మందులకు తగ్గని Pseudomonas aeruginosa వంటి ప్రమాదకరమైన ఇన్‌ఫెక్షన్లు కూడా ఉన్నాయి.

ట్రీట్మెంట్ కు దూరంగా ఉండటం, వైద్యం కోసం ఎక్కువ దూరం ప్రయాణించాల్సి రావడం అలాగే ఇంటి లోపల పొగ సాధారణం కావడం, పొగ హానికరం కాదు అనే నమ్మకం ఇవన్నీ కలిసి మహిళలను ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యల్లో పడేస్తున్నాయి.