V6 News

ఆంక్షలు లేకుండా మక్కలు కొనాలి: మాజీ మంత్రి జీవన్రెడ్డి

ఆంక్షలు లేకుండా మక్కలు కొనాలి: మాజీ మంత్రి జీవన్రెడ్డి

రాయికల్‌‌‌‌/ జగిత్యాల టౌన్‌‌‌‌, వెలుగు: మక్కల కొనుగోలులో ఆంక్షల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, దళారుల బెడద లేకుండా రైతుల నుంచి నేరుగా మక్కలు కొనుగోలు చేయాలని మాజీ మంత్రి, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.జీవన్​రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌‌‌‌ చేశారు. శుక్రవారం జగిత్యాల జిల్లా రాయికల్​పట్టణంలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లతో కలిసి మీడియాతో మాట్లాడారు. 

కాళేశ్వరం ప్రాజెక్ట్  వల్ల రైతులకు సాగునీరు అందుతుంటే కుంగిన రెండు పిల్లర్లను రిపేర్‌‌‌‌‌‌‌‌ చేయకుండా ప్రభుత్వం.. కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను దోషిగా చూపే ప్రయత్నం చేస్తోందని, ఈక్రమంలో హైకోర్టు తీర్పు రేవంత్‌‌‌‌రెడ్డి సర్కార్‌‌‌‌‌‌‌‌కు చెంప పెట్టులాంటిదన్నారు. గతంలో వరి, మొక్కజొన్నలను ఆంక్షలు లేకుండా కొన్నారని, ఇప్పుడేమో ఎకరాకు 25 క్వింటాళ్లు మాత్రమే కొంటున్నారని విమర్శించారు. 

అంతకుముందు జగిత్యాల ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు చేపట్టిన సమ్మెకు జీవన్‌‌‌‌రెడ్డి మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను చేపడితే, ప్రస్తుత కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే కార్మికులు కార్మికులు రోడ్డెక్కాల్సి వచ్చిందని విమర్శించారు.