వాళ్లు వేసుకునే డ్రెస్స్ లతోనే కరోనా

వాళ్లు వేసుకునే డ్రెస్స్ లతోనే కరోనా
  • పాక్ మతగురువు వివాదస్పద వ్యాఖ్యలు

కరాచీ : ప్రపంచాన్ని కుదిపేస్తోన్న కరోనా కు కారణం మహిళలు వేసుకునే డ్రెస్సులేనంట. అవును సంప్రదాయాలకు విరుద్ధంగా వారు బట్టలు వేసుకుంటున్నందుకే కరోనా వ్యాప్తి చెందుతుందంట. ఇదేంటీ ఈ తిక్క కామెంట్లు ఏంటనీ ఆశ్చర్యపోతున్నారా? పాకిస్తాన్ కు చెందిన ప్రముఖ మత గురువు తారిఖ్ జమీల్ ఇదే చెబుతున్నారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాల్గొన్న కార్యక్రమంలోనే ఆయన ఈ కామెంట్లు చేశారు. కరోనా రోగుల నిధుల కోసం ఓ టీవీ చానెల్ లైవ్ షో ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో లైవ్ లో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఉండగానే తారిఖ్ జమీల్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు మత సంప్రదాయాన్ని అనుసరించకుండా చిన్న బట్టలు వేసుకుంటున్నారని వాళ్ల వస్త్రధారణ కారణంగానే కరోనా వచ్చిందని చెప్పారు. వారు చేస్తున్న పాపాల కారణంగానే ప్రపంచానికి కరోనా పీడ మొదలైందంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. కరోనాకు కారణం మహిళలే అన్నట్లుగా తారిఖ్ జమీల్ మాట్లాడారు. ఈ కామెంట్లపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పటికీ తారిఖ్ జమీల్ తన కామెంట్లను సమర్థించుకుంటున్నారు.