‘గాంధీ’లో కరోనా డెడ్ బాడీ మాయం

‘గాంధీ’లో కరోనా డెడ్ బాడీ మాయం

గాంధీ ఆస్పత్రిలో కరోనాతో చనిపోయిన వ్యక్తి మృతదేహం బుధవారం నుంచి కనిపించకుండా పోయింది. తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. లాక్డౌన్ సడలించిన తర్వాత కేసుల సంఖ్య రోజుకు వందకు పైగానే ఉంటుంది. అలాగే మృతుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. బుధవారం మధ్యాహ్నం గాంధీ ఆస్పత్రిలో కరోనాతో చనిపోయిన వ్యక్తి డెడ్ బాడీ మిస్సయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు డెడ్ బాడీ గురించి ఎటువంటి వివరాలు తెలియలేదు. దాంతో గాంధీ సిబ్బంది కరోనా పేషంట్ల రికార్డులన్నీ తనిఖీ చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తి ఎవరా అని పేషంట్ల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా మృతులు పెరగడంతో మార్చురీ గదులన్నీ నిండిపోయాయి. అంతేకాకుండా.. గాంధీలో వార్డు బాయ్ ల కొరత కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అటు వైద్యులు సరిపోయేంత మంది లేక.. ఇటు వార్డు బాయ్ లు లేక గాంధీలో ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని పలువురు వాపోతున్నారు. మృతదేహం మిస్పవడంపై పేషంట్ల బంధువులు గాంధీ ఆస్పత్రి యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

For More News..

ఫస్ట్ నైటే భార్యను చంపిన భర్త.. ఎందుకంటే?

కేటీఆర్ మోసం చేశాడని ఫిర్యాదు.. కంప్లైంట్ తీసుకోని పోలీసులు

దగ్గుతున్నాడని బస్సులోంచి దింపేసిన్రు.. కాసేపటికే రోడ్డుపై మృతి

ఆస్పత్రి వాష్ రూంలో కరోనా పేషంట్ డెడ్ బాడీ