కరోనా ఎఫెక్ట్: భద్రాచలంలో ముక్కోటి ఉత్సవాలు రద్దు

కరోనా ఎఫెక్ట్: భద్రాచలంలో ముక్కోటి ఉత్సవాలు రద్దు

భద్రాచలం: రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా కేసుల ప్రభావం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంపై పడింది. ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో ఇవాళ్టి నుంచి ఈనెల 10వ తేదీ వరకు జరగాల్సిన వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు రద్దు చేశారు. అలాగే స్వామి వారి తిరువీధి సేవలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా రద్దు చేసినట్లు దేవస్థానం ఈవో బి.శివాజీ ఒక ప్రకటనలో తెలియజేశారు. దేవస్థానంలో సేవల పునరుద్ధరణ గురించి కరోనా ప్రభావం ముగిశాక ప్రకటిస్తామని ఆయన తెలిపారు. భక్తులు సేవల రద్దు విషయంలో సహకరించాలని.. కరోనా మహమ్మారి సామాజిక వ్యాప్తిని నివారించాలని ఆయన కోరారు. 

 

ఇవి కూడా చదవండి

బండి సంజయ్ కు బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా ఫోన్

 మీ పాన్ కార్డు అసలైందేనా ? తెలుసుకోండి ఇలా..

బండ్లు, కార్ల అమ్మకాల్లో జోష్.. రాష్ట్రంలో కోటిన్నరకు చేరువైన వెహికల్స్