అసెంబ్లీకి కరోనా ఎఫెక్ట్​

అసెంబ్లీకి కరోనా ఎఫెక్ట్​

8 రోజుల్లోనే బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమావేశాలు ముగింపు
ఉభయసభలు నిరవధిక వాయిదా
బడ్జెట్ సమావేశాలపై కరోనా ఎఫెక్ట్ పడింది. వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా అసెంబ్లీ సమావేశాలను సోమవారానికే ముగించారు. ఈ సారి బడ్జెట్ సెషన్ శాసనసభలో 8 రోజులు, శాసన మండలిలో 7 రోజులు మాత్రమే కొనసాగింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇంత తక్కువ రోజులు జరగటం ఇదే మొదటిసారి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 6 న  ప్రారంభమైన సెషన్ 20 వ తేదీ వరకు కొనసాగాల్సి ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి పెరగుతుడంటడంతో అసెంబ్లీ సమావేశాలు త్వరగా ముగించారు. సోమవారం ఉభయ సభలు నిరవధిక వాయిదా పడ్డాయి.

6 బిల్లులకు ఆమోదం

బడ్జెట్ సెషన్ లో ఉభయ సభల్లో 6 బిల్లులు ఆమోదం పొందాయి.  సిటిజన్ షిప్ అమెండ్ మెంట్ యాక్ట్  (సీఏఏ) ను సవరించాలంటూ శాసన సభ, శాసనమండలి తీర్మానం చేశాయి. కరోనా, పల్లె ప్రగతి పై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు మరో పదేళ్ల పొడగింపు తీర్మానం చేశాయి.  శాసన సభలో 24  ప్రశ్నలకు ప్రభుత్వం తరుపున మౌఖిక సమాధానం ఇవ్వగా మరో 31 ప్రశ్నలకు సభ్యులకు సమాధానాలు పంపించారు. 76 మంది సభ్యులు మాట్లాడారు. 60 మంది సభ్యులు అనుబంధ చర్చలో పాల్గొన్నారు. శాసనమండలి 28 గంటల 22 నిమిషాలు కొనసాగింది. 17 ప్రశ్నలు ప్రస్తావనకు వచ్చాయి. మరో 19 ప్రశ్నలకు సభ్యులకు సమాధానాలు పంపారు.

48 గంటల 41 నిమిషాలు
శాసససభ 48 గంటల 41 నిమిషాల పాటు కొనసాగింది. సీఎం కేసీఆర్ 5.58 గంటలు సభలో మాట్లాడారు. మంత్రులు 17.43 గంటలు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు11.06 గంటల పాటు మాట్లాడగ కాంగ్రెస్ సభ్యులు 7.02 గంటలు, ఎంఐఎం 5.14 గంటలు, బీజేపీ 0.57, టీడీపీ 0.27, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 0.7, నామినేటెడ్ సభ్యుడు 0.3 గంటలు చొప్పున సభలో మాట్లాడారు.