బాసర సరస్వతి ఆలయం మూసివేత

బాసర సరస్వతి ఆలయం మూసివేత

నిర్మల్ జిల్లా: లాక్ డౌన్ తో బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం మూసివేయాలని నిర్ణయించారు. రేపటి నుండి ఈనెల 21 వరకు అమ్మవారి అలయంతో పాటు ఉప ఆలయాల్లో దర్శనాలు, ఆర్జిత సేవల నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అమ్మవార్ల  నిత్య  పూజలను ఏకాంతంగా దేవస్థాన వైదిక బృందంతో అతికొద్ది మంది ఆధ్వర్యంలో జరుగుతాయని దేవస్థానం అధికారులు ప్రకటించారు. భక్తులు కరోనా మహమ్మారి లాక్డౌన్ పూర్తిగా తొలగిపోయేందుకు సహకరించాలని కోరారు. భక్తులకు దర్శనాలు తిరిగి ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చేది తర్వాత ప్రకటిస్తామని వారు పేర్కొన్నారు.