గాంధీలో మరో దారుణం..ఆక్సిజన్​ ఇవ్వకపోవడంతో కరోనా పేషెంట్​ మృతి

గాంధీలో మరో దారుణం..ఆక్సిజన్​ ఇవ్వకపోవడంతో  కరోనా పేషెంట్​ మృతి
  • తనను పట్టించుకోలేదని బంధువులకు ఫోన్​
  • సోషల్​ మీడియాలో ఆడియో క్లిప్​ వైరల్​

పద్మారావునగర్​, వెలుగు: నిన్నటికినిన్న కరోనాతో చనిపోయినామె డెడ్​బాడీని ఆరుగంటల పాటు బెడ్​పైనే ఉంచారు. ఆ ఘటన మరువకముందే గాంధీలో మరో దారుణం జరిగింది. బుధవారం ఉదయం టైంకు ఆక్సిజన్​ అందక కరోనా పేషెంట్​ చనిపోయాడు. హైదరాబాద్​లోని సైనిక్​పురి కాకతీయనగర్​కు చెందిన శ్రీధర్​ (32) అనే వ్యక్తి నాలుగు రోజులుగా శ్వాస సమస్యలతో బాధపడుతున్నాడు. దీంతో రెండ్రోజుల కిందట అతడిని ఉస్మానియా ఆస్పత్రిలో చేర్చారు. కరోనా టెస్టుల్లో పాజిటివ్ తేలడంతో వెంటనే గాంధీకి తరలించారు. మంగళవారం రాత్రి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. ఎవరూ  పట్టించుకోలేదు. ఆక్సిజన్​ పెట్టలేదు. దీంతో బుధవారం ఉదయం చనిపోయాడు. చనిపోయే ముందు బంధువులకు ఫోన్​ చేసి జరిగింది చెప్పాడు. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉందని, తనను ఎవరూ పట్టించుకోవట్లేదని బాధపడ్డాడు. ఆ ఆడియో క్లిప్​లు సోషల్​మీడియాలో వైరల్​ అయ్యాయి. శ్రీధర్​ స్వస్థలం కర్నూలు. భార్య, రెండేండ్ల బాబు ఉన్నాడు. మెకానిక్​గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఉస్మానియాలో రెండ్రోజులు ఆక్సిజన్​తో తన భర్త బతికాడని.. అక్కడి వైద్యులే గాంధీకి పంపించారని శ్రీధర్​ భార్య స్వరూప ఆవేదన వ్యక్తం చేసింది. గాంధీలో ఆక్సిజన్​ కొరత లేదని.. 2,600 మంది పేషెంట్లకు సరిపడా ఆక్సిజన్​ ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్​  వివరణ ఇచ్చారు.

సెక్రటేరియట్ కూల్చడానికి మాత్రమే పర్మిషన్ తీసుకున్నాం