గాంధీ నుంచి కరోనా బాధితుడి డిశ్చార్జి

గాంధీ నుంచి కరోనా బాధితుడి డిశ్చార్జి

పూర్తిగా నయం కావడంతో ఇంటికి పంపిన డాక్టర్లు

పద్మారావు నగర్, వెలుగు: కరోనా వైరస్ బారినపడి గాంధీ ఆస్పత్రిలో ట్రీట్​మెంట్​ పొందిన బాధితుడిని డాక్టర్లు డిశ్చార్జి చేశారు. అన్ని రకాలుగా కోలుకోవడం, మూడు దఫాలుగా చేసిన టెస్టుల్లో నెగెటివ్​ రావడంతో శుక్రవారం రాత్రి ఇంటికి పంపించేశారు. 14 రోజుల పాటు బయటికి రాకుండా ఇంట్లోనే ఐసోలేషన్​లో ఉండాలని ఆదేశించారు. దీంతో రాష్ట్రంలో నమోదైన తొలి కరోనా కేసు కథ ముగిసింది. సికింద్రాబాద్​ లోని మహేంద్ర హిల్స్​కు చెందిన సాఫ్ట్​వేర్​ ఉద్యోగి.. కొద్దిరోజుల కింద బెంగళూరు మీదుగా విదేశాలకు వెళ్లడంతో కరోనా బారినపడిన విషయం తెలిసిందే. మార్చి రెండో తేదీ ఉంచి ఆయనకు గాంధీ హాస్పిటల్​ లో ట్రీట్​ మెంట్​ అందించారు. ఆయనతో సన్నిహితంగా మెలిగిన 88 మందికి టెస్టులు చేయించి, ఎవరికీ కరోనా సోకలేదని నిర్ధారించారు. పన్నెండు రోజుల ట్రీట్​మెంట్​ తర్వాత ఆయన ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది. పూర్తిగా నయం కావడంతో అతడిని డిశ్చార్జి చేశామని, ప్రస్తుతం తెలంగాణ గడ్డమీద ఒక్కరికి కూడా కరోనా లేదని మంత్రి ఈటల రాజేందర్​ ప్రకటించారు.