బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరికి కరోనా పాజిటివ్

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరికి కరోనా పాజిటివ్

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సీనియర్ నేత దగ్గుబాటి పురంధేశ్వరికి కరోనా సోకింది. ఆమె గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుండటంతో కరోనా పరీక్ష చేయించుకున్నారు. ఆ పరీక్షలో ఆమెకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో.. ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం పురంధేశ్వరి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పురంధేశ్వరి మొదట హోంక్వారంటైన్‌లో ఉండాలని భావించారు. కానీ.. జ్వరం, దగ్గు తీవ్రంగా ఉండటంతో కుటుంబసభ్యుల సూచనమేరకు ఆస్పత్రిలో చేరారు. కాగా.. కరోనా పాజిటివ్ రావడంతో.. తనతో కాంటాక్ట్‌లో ఉన్నవాళ్లందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆమె కోరారు. బీజేపీ అధిష్టానం రెండు రోజుల క్రితం.. పురంధేశ్వరిని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రకటించింది. దాంతో చాలామంది నేతలు, కార్యకర్తలు ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు వారంతా ఆందోళనకు గురవుతున్నారు.

For More News..

అమెరికా ఆర్థిక వ్యవస్థను ట్రంప్ భ్రష్టుపట్టించారు: జో బైడెన్

ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు

తెలంగాణలో కొత్తగా 2,103 కరోనా కేసులు