కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి: భట్టి విక్రమార్క

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి: భట్టి విక్రమార్క

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని…పేదలకు ఫ్రీగా వైద్యం అందించాలని  కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అప్పులు ప్రమాదకరంగా మారుతున్నాయన్నారు. ప్రభుత్వం ఏడాదికి రూ.50 వేల కోట్ల అప్పు తెచ్చుకునేలా.. ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంచుతూ ఆర్డినెన్స్ తెచ్చారన్నారు. కార్పొరేషన్ అప్పులు కూడా 200 శాతానికి పెంచుకున్నారని…. అప్పులు, పన్నుల భారం ప్రజల మీదే పడుతుందన్నారు.

రేపటి(బుధవారం) నుంచి సీఎల్పీ నేతృత్వంలో జిల్లా ఆస్పత్రుల్లో పర్యటన చేస్తామన్నారు భట్టి. బుధవారం భద్రాచలం నుంచి పర్యటన ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆస్పత్రుల్లో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని భట్టి విక్రమార్క చెప్పారు.