
హైదరాబాద్: కొండాపూర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం (జూన్ 20) రాత్రి చిరక్ స్కూల్ సమీపంలోని బాబు కదిరి అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. అపార్ట్మెంట్ ఎనిమిదో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.
ఫైరింజన్ల సహయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదంతో అపార్ట్మెంట్ వాసులు భయాందోళకు గురయ్యారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.