అందరూ తెలుసుకోండి:ఈ 10 అలవాట్లు మీకు ఉంటే..మీరు ఆనందంగా లేనట్లే..

అందరూ తెలుసుకోండి:ఈ 10 అలవాట్లు మీకు ఉంటే..మీరు ఆనందంగా లేనట్లే..

జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేవు.. లైఫ్ అంతా బాగానే ఉంది అనిపించినా మీలో ఏదో తక్కువ అయింది అన్నట్లు ఎప్పుడైనా అనిపించిందా? మీ మూడ్ ఎయిర్ ప్లేన్ మోడ్ లో వెళ్లినట్లు అనిపిస్తుందా? అయితే దీనికి కారణం హ్యాపీ హార్మోన్స్ స్టక్ అయిండొచ్చు. మన శరీరంలో సంతోషాన్ని అందించే హార్మోన్లు డోపమైన్, సెరోటోనిన్, ఆక్సిటోసిన్ ,ఎండార్ఫిన్లు. కెమికల్ హీరోలు అయిన ఈ హార్మోన్లు సరియైన రీతిలో ఉత్పత్తి అయితే మనం హ్యాపీగా ఉంటాం. మరి హ్యాపీ హార్మోన్లు ఎందుకు స్టక్ అవుతాయి?. అంటే మన రోజువారీ అలవాట్లు (హ్యాబిట్స్) వాటిని సైలెంట్ గా నాశనం చేస్తాయి. కారణం లేకుండా కోపం, అలసట కు దారితీస్తాయి. హ్యపీ హార్మోన్లను నాశనం చేసే 10 రకాల రోజూవారీ అలవాట్ల గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. 

నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నాారా..

తగినంత నాణ్యమైన నిద్ర లేకపోవడం సెరోటోనిన్ ,డోపమైన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్ల ఉత్పత్తి ,నియంత్రణను నిరంతరం దెబ్బతీస్తుంది. ఇది చిరాకు, మూడ్ బాలేకపోవడం, భావోద్వేగాలను కంట్రోల్ చేయలేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. గాఢ నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి - ఇది ప్రాథమికంగా దొరికే ఉచిత చికిత్స. 

సెల్ ఫోన్ వాడకం, అధిరకంగా సోషల్ మీడియా వినియోగం.. 

అధిక సెల్ ఫోన్ వాడకం, క్యూరేటెడ్ ఫీడ్‌ల ద్వారా నిరంతరం స్క్రోల్ చేయడం వల్ల ఆత్మన్యూనత, తప్పిపోతామనే భయం(FOMO )కి దారితీస్తుంది. ఇది కార్టిసాల్ (ఒత్తిడి హార్మోన్)ను ప్రేరేపిస్తుంది. డోపమైన్,సెరోటోనిన్‌ను ప్రభావితం చేస్తుంది.

బద్దకంగా జీవనశైలి (శారీరక శ్రమ లేకపోవడం): 

వ్యాయామం అనేది శక్తివంతమైన సహజ మూడ్ బూస్టర్. ఎండార్ఫిన్లు, డోపమైన్ ,సెరోటోనిన్‌లను విడుదల చేస్తుంది. శారీరక శ్రమ లేకపోవడం వల్ల మీ శరీరం ఈ మానసిక స్థితిని పెంచే కెమికల్స్ కోల్పోతుంది. ఇది బద్ధకం,మూడ్ బాగోలేకపోవడం వంటి సమస్యలకు దారితీస్తుంది.

ప్రాసెస్డ్ ఫుడ్: 

ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెర అధికంగా ఉండే ముఖ్యమైన పోషకాలు లేని ఆహారం, పెద్ద ప్రేగు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.ఇది సెరోటోనిన్ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది. ఎందుకంటే  సెరోటోనిన్ సుమారు 90% గట్‌లో ఉత్పత్తి అవుతుంది. ఇది వాపు ,మానసిక స్థితిలో మార్పులకు దారితీస్తుంది.

ఒత్తిడిలో ఉంటున్నారా..

దీర్ఘకాలిక ఒత్తిడి మీ శరీరాన్ని పోరాటంనుంచి పారిపోయే స్థితికి తెస్తుంది. నిరంతరం కార్టిసాల్‌ను విడుదల చేస్తుంది. ఇది కాలక్రమేణా డోపమైన్ ,సెరోటోనిన్‌ను క్షీణింపజేస్తుంది, బర్న్అవుట్, ఆందోళన నిరాశకు దారితీస్తుంది.

అధిక ఆల్కహాల్ వినియోగం.. 

ఆల్కహాల్ దీర్ఘకాలిక వినియోగం న్యూరోగ్రాన్స్మిటర్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఇది డోపమైన్ ,సెరోటోనిన్ దీర్ఘకాలిక క్షీణతకు దారితీస్తుంది. మానసిక స్థితి మరింత దిగజారిపోతుంది, ఇతరుపై ఆధారపడే పరిస్థితి వస్తుంది. 

సూర్యరశ్మి తగలకపోతే ఆనందమే లేదు

సహజ కాంతి లేకపోవడం వల్ల మీ విటమిన్ డి స్థాయిలు తగ్గుతాయి. ఇవి సెరోటోనిన్ కు చాలా కీలకం. 15నుంచి -20 నిమిషాలు బయట ఉండటం కూడా మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. 

శారీరక స్పర్శను నిర్లక్ష్యం చేస్తున్నారా..

మానవ స్పర్శ ఆక్సిటోసిన్ ను పెంచుతుంది. దీనిని -కౌగిలించుకునే హార్మోన్ అని కూడా పిలుస్తారు. మీ జీవితంలో కౌగిలింతలు, చేయి పట్టుకోవడం లేదా మసాజ్ చేయడం లేనట్లయితే మీ మానసిక స్థితి దెబ్బతింటుంది. మీకు ఇష్టమైనవారికి హై-ఫైవ్ ఇవ్వడం వంటివి చేస్తే ఈ సమస్య తీరుతుంది. ఇలాంటివి చాలామంది తక్కువగా అంచనా వేస్తారు.

ఒంటరిగా గడుపుతున్నారా..

సాధారణంగా ఇంటర్నెట్, సోషల్ మీడియాలో ఎక్కువ కాలం గడిపేయడం చాలా సరదాగానే ఉంటుంది. దీనిని నెటిక్స్ మారథాన్ అని కూడా అంటారు. కానీ అది ఒంటరితనాన్ని పెంచుతుంది. ఇది ఆక్సిటోసిన్, సెరోటోనిన్ స్థాయిలను తగ్గిస్తుంది. 

ప్రతిదాని గురించి ఎక్కువగా ఆలోచించడం

నిరంతరం ఆలోచించడం వల్ల డోపమైన్ ,సెరోటోనిన్ స్థాయిలు దెబ్బతింటాయి. ఇది ఆందోళన ను పెంచుతుంది. మీ మెదడు రీప్లే మోడ్ లోకి బందీ అయిపోతుంది. ఇలా ఉన్నప్పుడు మీ ఆలోచనలను రాయండి. స్పర్శతో దృష్టి మరల్చండి.  

మిమ్మల్ని మీరు విమర్శించుకోవడం..

మిమ్మల్ని మీరు నిందించుకోవడం, విమర్శించుకోవడం అంటే మీలోని హ్యాపీ హార్మోన్స్ ను మీకై మీరే చంపుకున్నట్లే..ఇది ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. డోపమైన్ ను హరించివేస్తుంది-. ఇది రివార్డ్ కెమికల్. మీరు ఎప్పుడు మీపట్ల పాసిటివ్ గా ఉండండి.చిన్న విజయాలను కూడా సెలబ్రేట్ చేసుకోంది. మీరు మీ ప్రాణ స్నేహితుడితో మాట్లాడినట్లుగా మీతో మాట్లాడుకోండి. నిజంగా ఇది మీ మెదడును తిరిగి ఉత్సాహపరుస్తుంది. యాక్టివేట్ చేస్తుంది. 

ఈ అలవాట్ల గురించి తెలుసుకోవడం, సానుకూల మార్పులు చేసుకోవడం ద్వారా మీ సహజ సంతోషకరమైన హార్మోన్లను పెంపొందించడానికి మొదటి అడుగు. గుర్తు పెట్టుకోండి హెల్త్ ఈజ్ వెల్త్.