
ఫస్ట్ టైం.. ఏడు రోజుల యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ దేశంలో భయం కనిపించింది. ఇరాన్ ప్రయోగిస్తు్న్న క్లస్టర్ బాంబులతో ఆందోళన చెందుతుంది ఇజ్రాయెల్. ఎనిమిదో రోజు యుద్ధంలో.. ఇరాన్ నుంచి వచ్చిన క్లస్టర్ బాంబులు ఇజ్రాయెల్ దేశంలోని ఓ పెద్ద ఆస్పత్రిని కూల్చేశాయి.. ఇది మిస్సైల్ దాడి కాదని.. క్లస్టర్ బాంబులు అని ఇజ్రాయెల్ చెబుతుంది. ఇరాన్ క్లస్టర్ బాంబుల ప్రయోగంపై ఇజ్రాయెల్ ఎందుకు భయపడుతుంది.. ఈ క్లస్టర్ బాంబులు అంటే ఏంటీ అనేది తెలుసుకుందాం..
క్లస్టర్ బాంబులు అంటే ఏంటీ..?
క్లస్టర్ బాంబ్స్ చాలా ప్రమాదకరం. ఓ మిస్సైల్ ఉంటుంది. ఆ మిస్సైల్ లో వందల కొద్దీ చిన్న చిన్న బాంబులు ఉంటాయి. వందల సంఖ్యలో ఉండే ఈ చిన్న బాంబులను.. ఓ మిస్సైల్ లో అమర్చుతారు. ఆ మిస్సైల్స్ ను యుద్ధ విమానాల నుంచి లేదా డ్రోన్ల ద్వారా ప్రయోగిస్తారు. వాళ్ల టార్గెట్ రీచ్ అయిన వెంటనే.. ఆ మిస్సైల్ లోని బాంబులు వర్షం మాదిరిగా పడతాయి.
దీంతో ఆ ప్రాంతం మొత్తం పేలిపోయింది. ఈ క్లస్టర్ బాంబులకు ఓ ప్రాంతం అంటూ ఏదీ ఉండదు. గాల్లో ఉన్నప్పుడే వీటిని రిలీజ్ చేయటం ద్వారా.. ఎక్కడ అంటే అక్కడ పడతాయి. టార్గెట్ ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల పరిధిలో పడతాయి. ఇరాన్ ఇప్పుడు ఇలాంటి క్లస్టర్ బాంబులను ప్రయోగిస్తుంది ఇజ్రాయెల్ దేశంపై.
ఈ క్లస్టర్ బాంబులు చాలా డేంజర్. వీటిలో కొన్ని పేలకుండా పడి ఉంటాయి. అలాంటి వాటిని గుర్తించటం కష్టం. ఆ తర్వాత ఎప్పుడైనా ఆ బాంబులు పేలే అవకాశం కూడా ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే.. ఓ పెద్ద గంపలో యాపిల్ పండ్లను ఉంచి.. వాటిని ఓ పెద్ద అపార్ట్ మెంట్ పైనుంచి విసిరేస్తే ఎలా ఉంటుంది.. ఎలా కిందకు పడతాయో.. అలాగే మిస్సైల్ నుంచి వచ్చే చిన్న చిన్న బాంబులు అన్నమాట.. ఈ క్లస్టర్ బాంబులు.
ఇరాన్ ఈ తరహా క్లస్టర్ బాంబులను ప్రయోగిస్తుండటంతో.. ఇజ్రాయెల్ భయపడుతుంది. ఆ బాంబులు చిన్నగా ఉండటం.. ఎక్కడ పడ్డాయో గుర్తించటం కష్టంగా మారుతుంది. పేలకుండా ఉన్న బాంబులను గుర్తించి నిర్వీర్యం చేయటం అనే పెద్ద సవాల్ కూడా..
మొదటి, రెండో ప్రపంచ యుద్ధంగా ఈ క్లస్టర్ బాంబులను పెద్ద సంఖ్యలో ఉపయోగించాయి అన్ని దేశాలు. దీని వల్లే కోట్ల మంది సైనికులు, జనం చనిపోయారు. దీంతో ఈ క్లస్టర్ బాంబులను ఉపయోగించకూడదని అన్ని దేశాలు ఓ నిర్ణయానికి వచ్చాయి. ఈ క్రమంలోనే 2010లో 123 దేశాలు.. క్లస్టర్ బాంబుల తయారీ, వినియోగంపై సంతకం చేశాయి. సంతకం చేయని దేశాల్లో అమెరికా, రష్యా, ఉక్రెయిన్ వంటి కొన్ని దేశాలు ఉన్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా తయారీ, నిల్వలపై నిషేధం ఉన్న క్లస్టర్ బాంబులను ఇరాన్ దేశం.. ఇజ్రాయెల్ పై ప్రయోగిస్తుండటంతో.. ఈ అంశం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఇజ్రాయెల్ దేశానికి మా సత్తా చూపిస్తాం.. వదిలేది లేదంటూ ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ ప్రకటించిన 24 గంటల్లోనే.. క్లస్టర్ బాంబులతో విరుచుకుపడటంతో.. రాబోయే రోజుల్లో ఇది అణు యుద్ధానికి అయినా దారితీసే ప్రమాదం లేకపోలేదని ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి.
As demonstrated in this brief video of the BL-755 Cluster Bomb, they can cover a lot of ground. Ideal for targets in the open. This was replaced by Brimstone, but should they return to service, or should we just buy more Brimstone? pic.twitter.com/uEf8B6d3Ue
— Think Defence (@thinkdefence) December 27, 2024