Gold Rate: శుభవార్త.. మళ్లీ తగ్గిన గోల్డ్ రేటు.. హైదరాబాదీస్ తాజా రేట్లివే..

Gold Rate: శుభవార్త.. మళ్లీ తగ్గిన గోల్డ్ రేటు.. హైదరాబాదీస్ తాజా రేట్లివే..

Gold Price Today: యుద్ధాలతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక ఆందోళనలు పెరుగుతున్న సమయంలో బంగారం ధరలు దిగొస్తున్నాయి. మరో పక్క ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు ఆర్థిక వ్యవస్థలపై ఒత్తిడిని తగ్గించేందుకు వడ్డీ రేట్లలో మార్పులు లేకుండా కొనసాగిస్తూ.. బంగారం నిల్వలను పెంచుకుంటూ పోతున్నాయి. ఇలాంటి తరుణంలో గోల్డ్ రేట్లు తగ్గుదలపై కొనుగోలుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు ఏకంగా రూ.5వేల 500 భారీ తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 210, ముంబైలో రూ.9వేల 210, దిల్లీలో రూ.9వేల 225, కలకత్తాలో రూ.9వేల 210, బెంగళూరులో రూ.9వేల 210, కేరళలో రూ.9వేల 210, పూణేలో రూ.9వేల 210, వడోదరలో రూ.9వేల 215, అహ్మదాబాదులో రూ.9వేల 215, జైపూరులో రూ.9వేల 225, లక్నోలో రూ.9వేల 225, మంగళూరులో రూ.9వేల 210, నాశిక్ లో రూ.9వేల 213, అయోధ్యలో రూ.9వేల 225, బళ్లారిలో రూ.9వేల 210, గురుగ్రాములో రూ.9వేల 225, నోయిడాలో రూ.9వేల 225 వద్ద కొనసాగుతున్నాయి. 

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు ఏకంగా రూ.6వేల తగ్గింపును చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.10వేల 048, ముంబైలో రూ.10వేల 048, దిల్లీలో రూ.10వేల 063, కలకత్తాలో రూ.10వేల 048, బెంగళూరులో రూ.10వేల 048, కేరళలో రూ.10వేల 048, పూణేలో రూ.10వేల 048, వడోదరలో రూ.10వేల 053, అహ్మదాబాదులో రూ.10వేల 053, జైపూరులో రూ.10వేల 063, లక్నోలో రూ.10వేల 063, మంగళూరులో రూ.10వేల 048, నాశిక్ లో రూ.10వేల 051, అయోధ్యలో రూ.10వేల 063, బళ్లారిలో రూ.10వేల 048, గురుగ్రాములో రూ.10వేల 063, నోయిడాలో రూ.10వేల 063గా ఉన్నాయి.

ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.92వేల 100 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి రూ.లక్ష 480గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 20వేల వద్ద ఉంది.