డిగ్రీతో ఉద్యోగాలు.. ఐటీపీఓలో యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు

డిగ్రీతో ఉద్యోగాలు.. ఐటీపీఓలో యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు

ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్(ఐటీపీఓ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులను భర్తీ చేయడానికి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 14.

పోస్టుల సంఖ్య: 32

పోస్టులు:  యంగ్ ప్రొఫెషనల్స్ 20,   యంగ్ ప్రొఫెషనల్స్(అడ్మినిస్ట్రేషన్) 02,  యంగ్ ప్రొఫెషనల్స్ (స్టోర్స్) 01, యంగ్ ప్రొఫెషనల్స్(డిజైన్ అండ్ డిస్ ప్లే) 02, యంగ్ ప్రొఫెషనల్స్(ఫైనాన్స్) 02, యంగ్ ప్రొఫెషనల్స్(లా) 01, యంగ్ ప్రొఫెషనల్స్ (హాస్పిటాలిటీ) 04.

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, బీటెక్ లేదా బీఈ, ఎల్ఎల్​బీ, బీఎఫ్​ఏ, సీఏ, ఎంబీఏ/ పీజీడీఎం పూర్తి చేసి ఉండాలి. 

వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 32 ఏండ్లు.  నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్లు ప్రారంభం: జూన్ 17 

లాస్ట్ డేట్: జులై 14. 

సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

శాలరీ: నెలకు రూ.60,000 చెల్లిస్తారు. 

పూర్తి వివరాలకు indiatradefair.com వెబ్ సైట్ లో చూడగలరు.