హైదరాబాద్ లో హెలికాఫ్టర్ దగ్ధం.. ఏమైందంటే...

హైదరాబాద్ లో హెలికాఫ్టర్ దగ్ధం.. ఏమైందంటే...

ఇటీవల దేశంలో వరుస విమాన ప్రమాదాలు కలవరపెడుతున్నాయి.. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం తర్వాత వరుసగా ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తడం కలవరపాటుకు గురి చేస్తోంది. ఇదిలా ఉండగా హైదరాబాద్ లో హెలికాఫ్టర్ దగ్దమయ్యింది. శుక్రవారం ( జూన్ 20 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. హైదరాబాద్ లోని గుర్రంగూడలో ఉన్న ఫ్లై టెక్ ఏవియేషన్ సమీపంలో చోటు చేసుకుంది ఈ ఘటన. చాలా కాలంగా నిరుపయోగంగా ఉన్న డమ్మీ హెలికాఫ్టర్ లో మంటలు చెలరేగాయి.

షూటింగ్ లకు ఉపయోగించే డమ్మీ హెలికాఫ్టర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయబ్రాంతులకు గురయ్యారు స్థానికులు. ఘటనపై ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు స్థానికులు. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలకు అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఈ డమ్మీ హెలికాఫ్టర్ చాలాకాలంగా వాడకుండా ఉందని.. ఒక్కసారిగా హెలికాఫ్టర్ లో మంటలు చెలరేగడంతో భయపడ్డామని తెలిపారు స్థానికులు. గుర్తు తెలియని వ్యక్తులు మంటలు అంటించి ఉంటారని భావిస్తున్నట్లు తెలిపారు స్థానికులు. ఈ ఘటనపై స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.