ప్రభుత్వ ల్యాబుల్లో తప్పుడు రిపోర్టులు!

V6 Velugu Posted on Jun 28, 2020

ఓ ప్రైవేటు ల్యాబ్​ల్లో కరోనా టెస్టుల్లో తప్పులు వస్తున్నాయని ప్రభుత్వం చెప్తుండగా.. మరోవైపు ప్రభుత్వ ల్యాబుల్లోనూ తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారని జిల్లాల్లో పనిచేసే డాక్టర్లు అంటున్నారు. కామారెడ్డి జిల్లా నుంచి ఈ నెల 23న 48 శాంపిల్స్‌ హైదరాబాద్‌కు పంపించారు. ఇందులో 32 నెగెటివ్ అని శుక్రవారం జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చారు. మిగిలిన 16 శాంపిళ్లలో 7 నెగెటివ్, 9 పాజిటివ్ అని శనివారం ఉదయం చెప్పారు. సాయంత్రానికి 9 కాదు.. ఒక్కటి మాత్రమే పాజిటివ్ అని సమాచారం ఇచ్చారు. పైగా, అనుమానం ఉంటే మరోసారి వాళ్లకు టెస్టులు చేస్తాం.. శాంపిల్స్ పంపించండని ఓ మెసేజ్ పెట్టారు. ఏంచేయాలో తెల్వక జిల్లా అధికారులు తలలు పట్టుకుంటున్నారు. చాలా జిల్లాల్లోనూ ఇదే దుస్థితి ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు. ప్రైవేటు ల్యాబుల్లో తప్పుల సంగతి బయటపెడుతున్న ఉన్నతాధికారులు.. ప్రభుత్వ ల్యాబుల్లో జరుగుతున్న ఈ తతంగాన్ని ఎందుకో పట్టించుకోవడం లేదని డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు.

సీఎం దత్తత ఊరికి రైతు బంద్ కట్

Tagged government, labs, corona, reports, test, False

Latest Videos

Subscribe Now

More News