అడిగినోళ్లకు కాదు.. అవసరమున్నోళ్లకే టీకా

అడిగినోళ్లకు కాదు.. అవసరమున్నోళ్లకే టీకా
  • యూత్‌కు కరోనా వ్యాక్సిన్  డిమాండ్‌పై కేంద్రం క్లారిటీ

న్యూఢిల్లీ: యూత్ సహా అన్ని వయసుల వారికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలన్న డిమాండ్ను కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం తోసిపుచ్చింది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో కరోనా ముప్పు ఎక్కువగా ఉన్నోళ్లు, ప్రాణాంతక జబ్బులతో బాధపడుతున్న వారిని రక్షించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆ శాఖ సెక్రటరీ రాజేశ్ భూషణ్ స్పష్టంచేశారు. ‘అడిగినోళ్లందరికీ వ్యాక్సిన్ వేయడం కాదు.. అవసరమున్నోళ్లకే వేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం’ అని ఆయన తేల్చిచెప్పారు. వ్యాక్సినేషన్ విషయంలో తేడా చూపకుండా అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని ఢిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్ సీఎంలు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై మంగళవారం రాజేశ్ భూషణ్ తో పాటు నీతిఅయోగ్ మెంబర్ వీకే పాల్ స్పందించారు. అందరికీ వ్యాక్సిన్ వేయడం మొదలుపెడితే కరోనాను కట్టడి చేయడంపైన ఫోకస్ తగ్గిపోతుందని పాల్ చెప్పారు. ప్రపంచంలో ఏ దేశం కూడా 45 ఏండ్ల కన్నా తక్కువ వయసు ఉన్నోళ్లకు వ్యాక్సిన్ వేయడంలేదని అన్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఫోకస్ మొత్తం కరోనా కట్టడి చర్యలపైనే ఉందని, టైమొచ్చినపుడు అందరికీ వ్యాక్సిన్వేయడానికి చర్యలు తీసుకుంటుందని వివరించారు.