జిల్లాలకు చేరిన కరోనా వ్యాక్సిన్.. రియాక్షన్ అయితే ఫ్రీ ట్రీట్‌మెంట్

జిల్లాలకు చేరిన కరోనా వ్యాక్సిన్.. రియాక్షన్ అయితే ఫ్రీ ట్రీట్‌మెంట్

ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ రాష్ట్రానికి వచ్చేసిందని డీఎంఈ రమేష్ రెడ్డి అన్నారు. వ్యాక్సిన్ ఇప్పటికే జిల్లాలకు చేరిందని ఆయన తెలిపారు. శనివారం ఉదయం 10.30కి ప్రధాని మోడీ వ్యాక్సినేషన్‌ను ప్రారంభిస్తారని ఆయన అన్నారు. ‘వ్యాక్సిన్ ఇప్పటికే అన్ని జిల్లాలకు వెళ్ళింది. రాష్ట్ర వ్యాప్తంగా 139 సెంటర్లలో వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. రెండు డోసుల్లో వ్యాక్సిన్ ఇస్తాం. మొదటి డోస్ ఇచ్చిన 28 రోజుల తర్వాత రెండో డోస్ ఇస్తాం. హైదరాబాద్‌లోని రెండు సెంటర్స్‌ గాంధీ, నార్సింగ్ పీహెచ్‌సీలలో మాత్రం టూవే ఇంట్రాక్షన్‌కు ఏర్పాట్లు చేశాం. పారిశుద్ధ్య కార్మికులు, హేల్త్ కేర్ వర్కర్లతో ఫస్ట్ లైవ్ ఇంట్రాక్షన్ ఉంటుంది. వీరితో ప్రధాని మోడీ మాట్లాడతారు. అదేవిధంగా హెల్త్ సిబ్బందితో కూడా మోడీ ఇంట్రారాక్ట్ వుతారు. మీడియా, సోషల్ మీడియాలలో డిఫరెంట్ స్టేట్‌మెంట్స్ చూస్తున్నాం. 18 ఏళ్ళ కంటే తక్కువ వయసు ఉన్నవారికి, పాలు ఇస్తున్న తల్లులకు వ్యాక్సిన్ ఇవ్వడం లేదు. వాళ్ళ మీద ప్రయోగాలు చెయ్యలేదు. వారం పది రోజుల్లో హెల్త్ కేర్ వర్కర్స్‌కు వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత 50 ఏళ్ళు పైబడిన వారు, 50 లోపు, మరియు ఇతర వ్యాధులు ఉన్నవారికి ఇస్తాం. రక్తం గడ్డ కట్టే జబ్బులు ఉన్నవారికి వ్యాక్సిన్ ఇవ్వం. రియాక్షన్‌లు ఎక్కువ వస్తాయనే అపోహలు ఉన్నాయి. కానీ, రియాక్షన్‌లు అందరికీ రావు. ఫివర్ రావడం లేదా వ్యాక్సిన్ ఇచ్చిన ప్లేస్‌లో పెయిన్ మరియు దురద ఉంటుంది. మేజర్ రియాక్షన్ లక్షల్లో ఒకరికి ఉంటుంది. హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన వాళ్ళు, కోవిడ్ వచ్చిన వాళ్లకు వ్యాక్సిన్ ఇవ్వం. కోవిడ్ వచ్చి తగ్గిన వారు 4 నుంచి 8 వారాల గ్యాప్ తరువాత వ్యాక్సిన్ తీసుకోవచ్చు. రాష్ట్రంలో 57 టీచింగ్ హాస్పిటల్స్‌లో వ్యాక్సిన్ ఇస్తున్నాం. వ్యాక్సిన్ తీసుకున్న వారికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తే.. వారికోసం అంబులెన్స్ మరియు ఐసీయూలో బెడ్స్ ఏర్పాటు చేస్తాం’ అని ఆయన తెలిపారు.

For More News..

రేపే వ్యాక్సినేషన్ షురూ.. ఎవరు వేసుకోవచ్చు? ఎవరు వేసుకోకూడదు?

బయటకే సెలూన్.. లోపల మాత్రం వేరే యవ్వారం

పిల్లల్ని స్కూల్‌కు పంపాలనుకుంటున్నారా? అయితే ఈ పేపర్‌పై సంతకం చేయాల్సిందే