డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లు.. రేపటి నుంచి షురూ

డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లు.. రేపటి నుంచి షురూ
  • దేశంలోనే తొలిసారిగా ‘మెడిసిన్స్ ​ఫ్రమ్​ ది స్కై’.. 11న వికారాబాద్​లో షురూ
  • రాష్ట్ర మంత్రులతో కలిసి ప్రారంభించనున్న కేంద్ర మంత్రి​ జ్యోతిరాదిత్య సింధియా
  • ప్రయోగాత్మకంగా ఐదు పీహెచ్​సీలకు పంపిణీ

వికారాబాద్, వెలుగు: దేశంలోనే మొదటిసారిగా వికారాబాద్ జిల్లాలో డ్రోన్ ద్వారా మెడిసిన్స్ (మెడిసిన్ ఫ్రమ్ ది స్కై) పంపే ప్రాజెక్టు​ స్టార్ట్​ కాబోతున్నది. ఈ నెల11న కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రాష్ట్ర మంత్రులు కేటీఆర్, సబితా రెడ్డితో కలిసి ప్రారంభించనున్నారు. ప్రయోగాత్మకంగా మొదటగా ఐదు పీహెచ్​సీలకు డ్రోన్ ​ద్వారా వ్యాక్సిన్లు పంపించనున్నారు. డ్రోన్​ 400 ఫీట్ల ఎత్తులో ఎగురుతూ..10 నుంచి 25 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. 50 నుంచి100 కిలోల బరువు మోయగలదు. ఎదురుగా గుట్టలు, విమానాలు వస్తే సెన్సార్ సిస్టమ్​తో పక్కకు తప్పుకుంటుంది. జిల్లా కేంద్రం నుంచి మెడిసిన్స్, వ్యాక్సిన్లు​అన్ని పీహెచ్​సీలకు అందించాలని నిర్ణయించారు. జిల్లా కలెక్టర్​ నిఖిల ప్రాజెక్టు​ ప్రారంభం, కేంద్ర మంత్రి పర్యటన ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు.