
అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల్లో 63,049 నమూనాలు పరీక్షించగా 664 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని గురువారం ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,70,076 కు చేరిందని చెప్పింది. కొత్తగా 11 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 7,014కి చేరిందని.. గడిచిన 24 గంటల్లో 835 మంది కోవిడ్ ను జయించి డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం 6,742యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపింది ఏపీ వైద్యారోగ్యశాఖ.