పేషెంట్‌‌‌‌ పరారీ పోలీసుల వెతుకులాట.. ఇంట్లోనే గుర్తించి గాంధీకి షిఫ్ట్

పేషెంట్‌‌‌‌ పరారీ పోలీసుల వెతుకులాట.. ఇంట్లోనే గుర్తించి గాంధీకి షిఫ్ట్

హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా హాస్పిటల్‌‌‌‌ నుంచి మంగళవారం కరోనా పేషెంట్‌‌‌‌ఒకరు పారిపోయారు. కరోనా అనుమానితులం దరినీ ఒకే వార్డులో ఉంచడం ఏమిటంటూ ఆ పేషెంట్ కొడుకు తండ్రిని తీసుకుని వెళ్లిపోయాడు. వెతుకులాట మొదలుపెట్టిన పోలీసులు.. చివరికి ఆ పేషెంట్ ఇంట్లోనే ఉన్నట్టుగుర్తించి, గాంధీ హాస్పిటల్కు తరలిం చారు. దీనిపై ఉస్మానియా సూపరింటెండెంట్‌‌‌‌ నాగేందర్‌‌‌‌‌‌‌‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

డాక్టర్లతో గొడవపడి..

కరోనా పాజిటివ్ పేషెంట్లకు గాంధీ హాస్పిట ల్‌‌‌‌లో ట్రీట్‌‌‌‌మెంట్ అందిస్తుండగా.. అనుమా నితులను వివిధ దవాఖానాల్లో ఐసోలేషన్లో ఉంచుతున్నారు. టెస్టుల్లో పాజిటివ్గా తేలితే గాంధీకి తరలిస్తున్నారు. ఇలా ఉస్మానియా హా స్పిటల్లోని ఓ వార్డులో 15 మంది అనుమా నితులను ఉంచి, శాంపిల్స్‌‌‌‌ను టెస్టుల కోసం పంపారు. వారిలో ఇద్దరికి మంగళవారం ఉదయమే పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. దీంతో అదే వార్డులో ఉన్న ఓ పేషెంట్ కుమారుడు మధ్యాహ్న సమయంలో డాక్టర్లతో వాగ్వాదానికి దిగాడు. అందరినీ ఒకే వార్డులో ఉంచడం వల్లతన తండ్రికి వైరస్ సోకే ప్రమాదం ఉందని గొడవ చేస్తూ.. తండ్రిని తీసుకెళ్లేందు కు ప్రయత్నించాడు. డ్యూటీలో ఉన్న డాక్టర్  అడ్డుకోవడంతో ఘర్షణ జరిగి.. ఓ జూనియర్ డాక్టర్  చెవికి గాయమైంది. ఈ క్రమంలో ఆ పేషెంట్, అతని కుమారుడు తప్పించు కుని వెళ్లిపోయారు ళ్లి . అయితే సాయంత్రం వచ్చిన రిపోర్టుల్లో సదరు పేషెంట్కు వైరస్ పాజిటివ్ ఉన్నట్టుతేలింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. మాదన్నపేటలోని ఇంటికి పేషెంట్ ఇంటికి వెళ్లినట్లు గుర్తించారు.   అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. కుటుంబ సభ్యులందరినీ ఐసోలేషన్‌‌‌‌కు తరలించారు. అయితే ఉస్మానియాను పూర్తి స్థాయి కరోనా దవాఖానాగా మార్చాలని.. లేకుంటే అను మానితులను ఉంచుతున్న వార్డును కూడా అక్కడి నుంచి ఎత్తేయాలని జూనియర్ డాక్ట ర్లుడిమాండ్ చేశారు