గాంధీకి కరోనా పేషెంట్లు వస్తూనే ఉన్నారు

గాంధీకి కరోనా పేషెంట్లు వస్తూనే ఉన్నారు

రాష్ట్రంలో కొత్తగా 30 కరోనా కేసులు నమో దయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 364కు చేరింది. ఇందులో 33 మంది ఇప్ప టికే డిశ్చార్జ్ అవ్వగా  సోమవారం మరో 12 మంది వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి  అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ ప్రక టించింది. ప్రస్తుతం 308 మంది రాష్ట్రంలోని వివిధ దవాఖాన్లలో చికిత్స తీసుకుంటు న్నట్టు చెప్పింది. కొత్తగా నమోదైన కేసులన్నీ మర్కజ్ లింకున్నవేనని తెలిపింది. కొత్తగా నమోదైన కేసుల్లో జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. సోమవారం కొత్తగా 8 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో అక్కడ కేసులు 13కు చేరాయి. నిజామాబాద్లో 7, సూర్యాపేటలో 6, మేడ్చల్ 3, మహబూబ్గ నగర్ లో 3, పెద్ద పల్లి, కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో ఒక్కో కేసునమోదు అయ్యాయి . ఖమ్మం జిల్లాలో ఓ కేసు నమోదైనట్టు ఆ జిల్లా వైద్యాధికారి ప్రకటించినప్పటికీ, వైద్యారోగ్యశాఖ బులెటిన్లో మాత్రం వెల్లడించలేదు.

మర్కజ్కు వెళ్లొచ్చిన 1,090 మంది శాంపిళ్లను ఆరోగ్యశాఖ పరీక్షించింది. ఇందులో పాజిటివ్ వచ్చిన వారి కుటుంబ సభ్యులు, ఇతర కాంటాక్ట్స్  శాంపిళనూ  సేకరించారు. ఇప్పటిదాకా మర్కజ్ లింక్ ఉన్న 2,600 మంది శాంపిళను టెస్ట్ లు  చేయగా, 2 వేల టెస్ట్ ఫలితాలు వెల్లడయ్యాయి. మరో 600 మంది ఫలితాలు మంగళ, బుధవా రాల్లోవెల్ల డయ్యే అవకాశాలున్నట్టు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. గాంధీ ఆస్పత్రికి కరోనా సస్పెక్టెడ్పెక్టె కేసుల రద్దీ కొనసాగుతోంది. మర్కజ్ కు వెళ్లొచ్చిన వారితో  కాంటాక్ట్ అయిన వాళ్లూ రోజూ వందలాది మంది టెస్టుల కోసం వస్తున్నారు. సోమవారం ఒక్కరోజే 277 మంది పరీక్షల కోసం ఆస్పత్రికి వచ్చారు. 138 మంది పేషెంట్లు ట్రీట్మెంట్ తీసుకుంటున్నా రు. ఆస్పత్రి ఆవరణను సోడియం హైపో క్లోరైట్ తో శానిటైజ్ చేశారు. ఓపీ బ్లాక్, మెయిన్ బిల్డిం గ్ , పోస్ట్మా ర్టంరూమ్,  ఎమర్జెన్సీ బ్లాక్ సహా అన్ని చోట్లా లిక్విడ్ను స్ప్రే చేశారు.