
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో కార్పొరేట్ కనెక్షన్ తన కార్యకలాపాలను విస్తరించింది. రాష్ట్ర ఐటి విభాగాల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ఈ సంస్థకు చెందిన కొత్త చాప్టర్‌ను ప్రారంభించారు. టెర్మినస్ గ్రూప్ ఎండీ ఎస్‌పీ రెడ్డి, కార్పొరేట్ కనెక్షన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఎస్ శరద్ మహిశ్వరి, కమలేష్ గుప్తా తదితరులు ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయేష్ రంజన్ మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమన్నారు. కానీ మన పురోగతి కొన్ని ప్రాంతాలకే పరిమితమైందని, పెద్ద కంపెనీలు బాగా రాణిస్తుండగా, ఎంఎస్‌ఎంఈలు (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు) ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించేలా పనిచేయాలని కార్పొరేట్ కనెక్షన్స్ సభ్యులను కోరారు