పోలీసుల‌కు చిక్కిన‌ కార్పొరేట‌ర్ భ‌ర్త

పోలీసుల‌కు చిక్కిన‌ కార్పొరేట‌ర్ భ‌ర్త

మేడ్చల్ జిల్లా : ఇటీవ‌ల త‌న అనుచ‌రుల‌తో బోడుప్పల్ కార్పొరేటర్ భర్త శ్రీధర్ గౌడ్, పురెందర్ రెడ్డి అనే వ్యక్తి ఇంటికి వెళ్లి అత‌డిపై దాడి చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సంఘ‌ట‌న‌పై మేడిప‌ల్లి పోలీస్ స్టేష‌న్ లో కేసు న‌మోదైన‌ప్ప‌ట్నుంచీ శ్రీధర్ గౌడ్ త‌ప్పించుకు తిరుగుతున్నాడు. అయితే శ్రీధర్ గౌడ్ ని గురువారం బీబీ నగర్ టోల్ గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. శ్రీధర్ గౌడ్ ని అదుపులోకి తీసుకున్న‌ట్లు తెలిపారు మేడిపల్లి పోలీసులు.